telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మహిళల సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: ఎర్రబెల్లి

erraballi dayaaker

మహిళల సాధికారతే ప్రభుత్వ లక్షమని తెలంగాణ పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావుఅన్నారు.పేదరిక నిర్మూలన సంస్థ (సెర్చ్‌) ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం వ్యవసాయానుబంధ పరిశ్రమలపై దృష్టి సారించిందని చెప్పారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం, దేవాదుల , ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జల విప్లవం వచ్చిందన్నారు. 24గంటలూ విద్యుత్‌  ఇవ్వడంతో  రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. సెర్చ్‌ ఆధ్వర్యంలోనే ఇప్పటికే 65,362 మహిళా రైతులతో 14,131 రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

Related posts