telugu navyamedia
వార్తలు సామాజిక

దూసుకొస్తున్న పాకిస్థాన్ మిడతలు!

locuts pakistan

పాకిస్థాన్ నుంచి ఇండియాకు దూసుకొచ్చిన మిడతల దండు లక్షలాది ఎకరాల్లో పంటను నాశనం చేస్తున్నాయి. ఈ రాకాసి మిడతలు రాజస్ఢాన్ మీదుగా ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతిలోకి ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే, అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది.

ఈ నేపథ్యక్మ్లో వ్యవసాయశాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి, నిపుణులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. జిల్లా, గ్రామ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆయన సూచన సూచించారు.

ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తూ, చెట్లపై నివాసం ఉంటూ, పంటలకు నష్టం కలిగిస్తున్నాయని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో రసాయనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. 

Related posts