telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

రోబోట్ల ద్వారా ప్రొడక్ట్స్‌ డెలివరీ ప్రారంభించిన అమెజాన్..!

Roboats

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వస్తువుల డెలివరీకి రోబోట్లను వినియోగిస్తుంది. రోబోట్ల ద్వారా అమెరికాలో ప్రొడక్ట్స్‌ను డెలివరీ చేయడం ప్రారంభించింది. వాషింగ్టన్‌లో ఉన్న స్నోహోమిష్ కౌంటీలో ప్రస్తుతం 6 రోబోట్లు అమెజాన్ ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నాయి. ఈ రోబోట్లు 6 చక్రాలను కలిగి ఉండగా వాటిపై బ్లూ కలర్ పెయింట్‌ను వేశారు. దానిపై ప్రైమ్ అని రాశారు. ఇక వీటిని అడోరా బాట్స్ అని అమెజాన్ వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం కస్టమర్లకు అమెజాన్ నుంచి ప్యాకేజీలను డెలివరీ చేస్తున్నప్పటికీ వాటికి తోడుగా అమెజాన్ స్కౌట్ అంబాసిడర్లు వెంట వెళ్తున్నారు. వీరు ఆ రోబోట్లను పర్యవేక్షించడంతోపాటు వాటి పనితీరుపై కస్టమర్లకు వచ్చే సందేహాలను తీరుస్తున్నారు. ఇక ఈ రోబోట్లతో కేవలం పగటి పూట మాత్రమే కాకుండా, రాత్రి పూట కూడా ప్యాకేజీలను డెలివరీ చేయిస్తున్నారు.

Related posts