telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆన్ లైన్ రమ్మీపై ఏపీ సర్కార్ నిషేధం

online rummy

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ రమ్మీపై నిషేధం విధించింది. ఆన్ లైన్ రమ్మీతో పాటు, పోకర్ పై కూడా నిషేధం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీటిని ప్రోత్సహిస్తూ ఎక్కడైనా నిర్వాహకులు పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.

మొదటి సారి పట్టుబడితే ఏడాది జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఆన్ లైన్లో జూదం ఆడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీని నిషేధించింది.

Related posts