నైపుణ్యాభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం 2019-20 సంవత్సర అంతర్జాతీయ కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమం మొదటి దశ కార్యక్రమానికి మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ సంస్థల ద్వారా మహిళల సాధికారత, సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం వంటి కోర్సులు ప్రస్తుత అవసరానికి అనుగుణంగా ఉన్నాయని అన్నారు.
గడచిన ఐదున్నర సంవత్సరాల కాలం నుంచి అభివృద్ధి వే గంగా జరుగుతోందని అన్నారు. ప్రధాని మోదీ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ద వహిస్తారని అన్నారు. శిక్షణ పూర్తిచేసిన వారందరూ స్వావలంభణ పొందేలా శిక్షణ ఇచ్చిన ఎంఎస్‌ఎంఈ అధికారులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. మార్కెట్‌ల అవగాహనను మెరుగుపర్చడానికి నిశ్శబ్ధంగా నిరంతరం పనిచేస్తూ, ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన అన్నారు.