ఎవరికి వారే హీరోలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో నడవదని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ అడుగుజాడల్లో పార్టీ నడుస్తుందని వివరించారు. గతంలో డబ్బు లేకున్నా డి. శ్రీనివాస్, కేశవరావు వంటి వ్యక్తులు పీసీసీ పదవులు లభించలేదా అంటూ గుర్తుచేశారు. తాను లోక కళ్యాణం కోసమే పీసీసీ పదవి అడుగుతున్నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలలో పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. ఇప్పటికే నా పూర్తి బయోడేటా వివరాలను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, అహ్మద్ పటేల్ వంటి కీలక నేతలందరికి రిజిస్టర్‌లో పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందని, ఎవరు తప్పు చేసినా నిలదీసే హక్కుతో పాటు అవసరమైతే పదవి నుంచి తొలగించే అధికారం ఉంటుందని వెల్లడించారు.