సీఎం జగన్ పై యనమల రామకృష్ణుడు మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి వితండ పాలన, వితండ వాదనలతో రాష్ట్రానికి తీరని చేటని..ఆ రోజున ఎన్నికలు కావాలని, ఈ రోజున వద్దని వాదించడం వితండం కాదా..? అని ప్రశ్నించారు. ఇలాంటి వితండ ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదని..కేంద్ర ఎన్నికల సంఘమే అనేక రాష్ట్రాల్లో జరుపుతోందన్నారు. మన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎన్నికలు వద్దనడం ఓటమి భయమేనని..ఎస్ ఈసి పరిధినే వైసిపి ప్రశ్నించడం వితండమే అని ఫైర్ అయ్యారు. ఎస్ ఈసి పిలిచినప్పుడు వైసిపి ఎందుకని వెళ్లలేదు..? ఈసి భేటికి వెళ్లకుండా బయట ప్రకటనలు, ప్రెస్ మీట్లు వైసిపి పెట్టడం ఏమిటి..? అని ప్రశ్నించారు. ఎన్నికల కోసం పెట్టిన సమావేశాన్ని అధికార పార్టీ బాయ్ కాట్ చేయడం ఎక్కడైనా ఉందా..?తన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనేది జగన్ కు అర్ధమైందన్నారు.
ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల వాయిదా కోసం వైసిపి పట్టు అని లేని ఇమేజ్ పెంచుకోడానికి రూ 8కోట్ల 15లక్షలతో ఒప్పందం సిగ్గుచేటు అని ఫైర్ అయ్యారు. ఫాల్స్ ఇమేజ్ పెంచుకున్నా నిలబడేది కాదనేది గుర్తుంచుకోండి అని వైసిపి నేతల ఇమేజ్ పెంచడానికి ప్రజాధనం దుర్వినియోగాన్ని ఖండిస్తున్నామని మండిపడ్డారు.
previous post
next post
దక్షిణాది హీరోలపై హీరోయిన్ కామెంట్స్