telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక ఎన్నిక : నోట్ల కట్టల వరద..వివరాలివే

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో బ్రేక్‌ పడింది. ఇక రేపటి నుంచి దుబ్బాకలో 144 సెక్షన్‌ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం దుబ్బాకలో ఎవరు గెలుస్తారని చూస్తున్నారు. అయితే..ఈ ఎన్నిక సందర్భంగా నోట్ల కట్టల వరద పారింది. దుబ్బాక ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. ప్రచారం ముగియడంతో నోట్ల కట్టల వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఎక్కడెక్కడ ఎంత డబ్బు పట్టుబడిందో లెక్కలతో సహా వెల్లడించారు. మహాంకాళీ పీఎస్‌ పరిధిలో రూ.16.69 లక్షలు, నారాయణగూడ పీఎస్‌ పరిధిలో రూ.14.90 లక్షలు, సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో రూ.31.26 లక్షలు, సైఫాబాద్‌లో రూ. 50లక్షలు, ఆఫ్జల్‌గంజ్‌లో రూ.21.56 లక్షలు, బేగంపేటలో రూ.కోటీ నగదు, వెస్ట్‌జోన్‌ పరిధిలో రూ.48లక్షలు, శామీర్‌పేటలో రూ.48లక్షలు, నార్సింగ్‌లో రూ.12లక్షలు, భూంపల్లిలో రూ.9లక్షలు,  సిద్దిపేటలో రూ.18 లక్షలు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు. కాగా..ఇవాళ దుబ్బాక బీజేపీ అభ్యర్ది రఘు నందన్ బావ మరిది అయిన సురభి శ్రీనివాస్ రావ్ ను హవాళ డబ్బు తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేసారు.

Related posts