telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

తెలుగులో టకాటకా .. మాట్లాడేస్తున్న అమెరికన్ … మనకీ అంత చక్కగా రాదు..

american speaking in telugu viral

అమెరికాకు చెందిన ఐజాక్ రిచర్డ్స్ అనే యువకుడు తెలుగులో మాట్లాడుతూ తెలుగువాళ్లను విస్మయానికి గురిచేస్తున్నాడు. కొంచెం యాసగా ధ్వనిస్తున్నా, రిచర్డ్స్ తెలుగు పలుకులు మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ యువకుడు యూఎస్ లో ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో పనిచేస్తున్నాడు. గతంలో రెండేళ్లపాటు విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఓ ప్రాజక్టులో భాగంగా పనిచేశాడు. అప్పుడు కష్టపడి నేర్చుకున్న తెలుగును ఇటీవల తన ఐస్ క్రీమ్ పార్లర్ కు వచ్చిన కొందరు తెలుగువాళ్ల ముందు ప్రదర్శించాడు.

రిచర్డ్స్ ను చూసి వాళ్లు షాక్ తినడమే కాదు, అతడి తెలుగు స్పీకింగ్ ను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, విపరీతమైన స్పందన వచ్చింది. అయితే, ఆ వీడియోలో రిచర్డ్స్ ను న్యూజిలాండ్ దేశస్తుడిగా పేర్కొన్నారు. తాను న్యూజిలాండ్ వాడ్ని కాదని, తాను అమెరికా జాతీయుడ్నని రిచర్డ్స్ స్వయంగా మరో వీడియోతో తెరపైకి వచ్చాడు. ఇప్పుడీ వీడియో కూడా వైరల్ అవుతోంది.

Related posts