telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్కూల్ ఏ మీడియం?: మంత్రి కొడాలి నాని

kodali nani ycp

చంద్రబాబు హైదరాబాద్ గండిపేటలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ స్కూల్ ఏ మీడియం? అని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరిలో మనబడి నాడు-నేడు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఇంగ్లీష్ మీడియంపై కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. విపక్ష నేతలు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించి.. పేదల విషయంలో మాత్రం నీతులు చెబుతున్నారని విమర్శించారు.

ఎర్రన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఢిల్లీ వెళ్లారని చెప్పారు. అచ్చెన్నాయుడుకు ఇంగ్లీష్ రాకపోవటంతో విజయవాడలో తిరుగుతున్నారన్నారు. అచ్చెన్నాయుడుని చూస్తే మాత్రం అందరికీ భయమన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంగ్లీష్‌కే ప్రాధాన్యం ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారు? పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదా? అని అడిగారు. నేటి తరం పిల్లలకు సీఎం జగన్ మేనమామ అని మంత్రి వ్యాఖ్యానించారు.

Related posts