telugu navyamedia
క్రీడలు వార్తలు

వచ్చే ఏడాది సిఎస్కే కెప్టెన్ డుప్లెసిస్…

ఐపీఎల్ 2021 లో ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్‌కు అప్పగించవచ్చని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఐపీఎల్ లో చెన్నైదారుణంగా విఫలమైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 2020 లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన చెన్నై 6 మ్యాచ్ లలో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 7 వ స్థానంతో లీగ్ ను ముగించింది. వచ్చే ఏడాది ధోని కెప్టెన్సీ నుండి తప్పుకొని ఆటగాడిగా ఆడుతాడు కావచ్చు అని సంజయ్ అభిప్రాయపడ్డారు. భారత జట్టులో కూడా తనకు ఇంకా ఆవకాశం ఉన్న ధోని కెప్టెన్ గా తప్పుకొని సరైన సమయంలో కోహ్లీకి ఆ బాధ్యతలు అప్పగించాడు. ఆ తర్వాత కూడా జట్టులో ఉండి వారికి మార్గ నిర్ధేశం చేసాడు. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ధోని అలానే చేస్తాడు అని నేను అనుకుంటున్నాను అంటూ సంజయ్ బంగర్ తెలిపాడు. క్వింటన్ డికాక్‌కు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఉన్న ఫాఫ్ డు ప్లెసిస్ కాకుండా చెన్నైకి నాయకుడిగా మరో బలమైన ఎంపిక లేదని బంగార్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రస్తుతానికి వారికి కెప్టెన్‌గా వేరే మార్గం లేదు. అలాగే వేలంలో లేదా ట్రేడింగ్‌లో, మిగిలిన జట్లు ఏవీ కెప్టెన్ అయ్యే సామర్ధ్యం ఉన్న ఆటగాడిని విడుదల చేయవు ”అని బంగర్ వివరించారు.

Related posts