కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రాణాలకు తెగించి వైద్యులు అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని తెలంగాణ గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. మహబాబూబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి డాక్టర్లకు పిపిఈ కిట్లను, మాస్కులను అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ వైద్యులకు ప్రతిపలంగా ప్రతి ఒక్కరూ చేయాల్సింది వారికి సహకరించడమేనని అన్నారు.
కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్నే గడగడలాడిస్తోందన్నారు. ఈ దిశలో సీఎం కేసీఆర్ ఆర్ధిక నష్టాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలే ముఖ్యమని భావించి లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.కేసీఆర్ ముందుచూపు కారణంగాన, దేశంలోని మిగిలిన రాష్ర్టాల కంటే కూడా మనం ఎంతో మెరుగ్గా ఉన్నామని ఆయన చెప్పారు.