ఏపీని వర్షాలు వదలడంలేదు. . గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షాలతో ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ఏపీకి మరో గండం రాబోతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో రానున్న 4,5 గంటల్లో అనేక జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు, చెద్దర్లు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. ఇప్పుడు మళ్ళీ రానున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు.
previous post
next post