telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

46 సంవత్సరాల ఎన్ .టి .ఆర్ “సతీ సావిత్రి”.

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం లలితా శివజ్యోతి వారి “సతీ సావిత్రి” 1978 జనవరి 4న విడుదలయింది నిర్మాత ఏ. శంకర రెడ్డి గారు లలితా శివజ్యోతి సినీ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు బి.ఏ.సుబ్బారావు గారి దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు: ఆచార్య ఆత్రేయ, పాటలు,పద్యాలు: సి. నారాయణ రెడ్డి, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, పిలకా గణపతిశాస్త్రి, కల్లూరి వీరభద్రశాస్త్రి, సంగీతం:: ఘంటసాల మరియు పెండ్యాల, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్, ట్రిక్ ఫోటోగ్రఫీ: రవికాంత్ నగాయచ్, కళ: గోఖెలే, నృత్యం: వెంపటి సత్యం, సంపత్-చిన్ని, ఎడిటింగ్: అక్కినేని సంజీవి, అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, వాణిశ్రీ, జమున, కృష్ణంరాజు, కాంతారావు, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, ధూళిపాళ, సత్యనారాయణ, రాజబాబు, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య,పి.జె.శర్మ, కె.వి.చలం, కె.ఆర్.విజయ, అంజలీదేవి, పండరీబాయి, రమాప్రభ, కాంచన, మాధవి, జయమాలిని, హలం, మమత తదితరులు నటించారు.

ప్రఖ్యాత సంగీత దర్శకులు ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు గార్లు సంగీత సారధ్యంలో
“ఏమిటో ఏమిటో ఈ పులకరింత, ఎందుకో మరి ఎందుకో ఈ గిలిగింత”
“అడుగడగునా కొత్తదనం,అణువణువన యవ్వనం, అందాలై మకరందాలై”
“యేమాత జగన్మాతా,పాహి పాహిమాం,మాతా వది పాహి పాహిమాం”
“వచ్చింది వచ్చింది మరో వసంతం,తెచ్చింది తెచ్చింది యవ్వనగంధం
వంటి పాటలు, పద్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రం లో ఒక పాట, ఒక శ్లోకం తో పాటు రెండు పాటలకు స్వరకల్పన చేసిన ఘంటసాల గారు మృతి చెందటంతో పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు. “లవకుశ” చిత్రాన్ని తీసిన నిర్మాత ఏ. శంకర రెడ్డి గారు నిర్మించిన ఈ గొప్ప పౌరాణిక చిత్రంలో ఎన్.టి రామారావు గారు యమధర్మరాజు గా అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి సినీ ప్రేక్షకుల మన్నలను పొందారు. ఈ చిత్రం విజయం సాధించి పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి, హైదరాబాద్ లో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శింపబడింది..

ఈ సినిమాను హిందీలో కి డబ్బింగు చేసి “సతీ సావిత్రి” పేరుతోనే 26-07-1981న విడుదల చేయగా అక్కడ కూడా విజయం సాధించింది..

Related posts