telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రభాస్ తో నివేద థామస్ రొమాన్స్… పారితోషకం ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్న ప్రభాస్.. ఇటీవలే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమాను కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించనున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌కి కూడా స్కోప్ ఉందట. ఇందుకోసం వేట ప్రారంభించిన నాగ్ అశ్విన్ నివేద థామస్ వైపు మొగ్గుచూపారని టాక్. ఈ మేరకు ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికైనా వెనుకాడొద్దని నిర్మాతలతో చెప్పారట. ప్రభాస్ 21వ సినిమాగా రానున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రానికి స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. మూవీ సాంకేతిక బృందం ఇతర నటీనటుల వివరాలు అతి త్వరలో ప్రకటించనుంది చిత్రబృందం.

Related posts