telugu navyamedia
సినిమా వార్తలు

నటరత్న ఎన్టీఆర్ గారి స్వదస్తూరి:

అలనాటి (1947) యన్టీఆర్ స్వయంగా రాసిన పోస్ట్ కార్డ్ లెటర్ రేర్ ఫోటో

1947 సంవత్సరంలో నటరత్న ఎన్టీరామారావు గారు గుంటూరు ‘ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీ” లో చదువుకొన్న రోజుల్లో ప్రఖ్యాత రంగస్థల నటుడు, రచయిత, పాత్రికేయడు, ఆకాశవాణి కేంద్రం తొలి న్యూస్ రీడర్, కంచు కంఠం, కళా వాచస్పతి కొంగర జగ్గయ్య గార్లు సహాధ్యాయులు.‌

ఎన్టీఆర్ జగ్గయ్య గారు ఇరువురు కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. సినిమారంగంలో రాక ముందు కాలేజీ సెలవుల్లో ఇద్దరు వారి వారి ఊళ్లకు వెళ్లిన నేపధ్యంలో ఎన్టీఆర్ గారు ఒకసారి జగ్గయ్య గారి ఉత్తరం రాసారు. అది ఒకటి అపురూపమైనవి ఎన్టీఆర్ గారు ఇంగ్లీష్ లో స్వంత దస్తూరితో రాసిన ఒక ‘భారతీయ పోస్ట్ కార్డు’ ఫోటో ఇది. ఆనాటి కాలంలో ఈ పోస్ట్ కార్డ్ ధర అర్ధ అణా మాత్రమే.

Related posts