telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఒరేయ్ బుజ్జిగా” ఫస్ట్ లుక్

OB

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ చిత్రాలతో ఆకట్టుకున్న కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో అభిరుచిగల కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…’ ఈ చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయనున్నారు. హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మాళవిక నాయర్‌లతో కూడిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఫిబ్రవరి 10 ఉదయం 10:10 లకు చిత్ర యూనిట్ విడుదల చేసింది. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts