telugu navyamedia
సినిమా వార్తలు

నేను రేప్ కు గురయ్యా… ఇప్పుడు నా పిల్లల గురించి భయపడుతున్నా…

Rape

దక్షిణాఫ్రికాలో మహిళలపై అత్యాచార ఘటనలు గణనీయంగా పెరిగాయి. అందుబాటులో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- 2016లో మహిళల హత్యల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉందని బీబీసీ రియాలిటీ చెక్ బృందం గుర్తించింది. 2016లో దక్షిణాఫ్రికాలో ప్రతి లక్ష మంది మహిళలకు 12.5 మంది చొప్పున హింస కారణంగా చనిపోయారు. 183 దేశాల అంతర్జాతీయ సగటు కేవలం 2.6 మందిగా ఉంది. లెసూటు, జమైకా, హొండురస్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2016లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో తొమ్మిది అత్యాచారాల్లో ఒకటే పోలీసుల దృష్టికి వస్తోంది. హత్యల రేటులో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది.

ఈ అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ దక్షిణాఫ్రికా ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. #AmINext అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో, ఇతర ఆన్‌లైన్ వేదికల్లో ఉద్యమిస్తున్నారు. దేశంలో మరణ శిక్షను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్‌పై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా సెప్టెంబరు 13న జోహన్నెస్‌బర్గ్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దక్షిణాఫ్రికా లైంగిక హింసపై ఆందోళన చెందుతున్న మహిళల్లో జోహన్నెస్‌బర్గ్‌లోని ఫొటోగ్రాఫర్ సారా మిడ్‌గ్లే ఒకరు. 37 ఏళ్ల సారాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఆమె అత్యాచారానికి గురయ్యారు. అది మిగిల్చిన మనోవేదన నుంచి ఆమె నేటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

2010లో నా మాజీ ప్రియుడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు శారీరకంగా, మానసికంగా దాదాపు 18 నెలలపాటు అతడు నన్ను క్షోభకు గురిచేయడంతో నేను అతడికి దూరమయ్యాను. నేను దూరమయ్యేందుకు యత్నించిన ప్రతిసారి అతడు మరింత హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. తన్నేవాడు, కొన్నిసార్లు గొంతు నులిమేవాడు, కొరికేవాడు. తనను వదిలేసి వెళ్తే, నా ఇద్దరు కుమార్తెలను అత్యాచారం చేసి, నా కళ్ల ముందే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నిసార్లు విద్యుత్ షాక్ కూడా ఇచ్చాడు. నేను ఇదంతా ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. అప్పటికే విడాకులు తీసుకొన్న నాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు అంత విలువిచ్చేవారు కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోరని నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చెప్పేవాడు.

చివరకు ధైర్యం చేసి అతడికి దూరంగా వచ్చేశాను. ఓ పది రోజుల తర్వాత, అతడు నా ఇంటి ముందుకు వచ్చేశాడు. నేను దిగ్భ్రాంతి చెందా. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే తన బంధువు ఫామ్ కు వెళ్లేందుకు డబ్బుల్లేవని, చివరిసారిగా తనకో సాయం చేయాలని అడిగాడు. తనను నా కార్లో తీసుకెళ్లి అతడి వద్ద వదిలేస్తే నా జీవితంలోంచి పూర్తిగా వెళ్లిపోతానని మాట ఇచ్చాడు. అది నమ్మడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. కారులో కొంత దూరం ప్రయాణం చేశాక నా మాజీ బాయ్‌ఫ్రెండ్ వాలకం నాకు అనుమానం కలిగించింది. అతడికి హెరాయిన్ తీసుకొనే అలవాటు ఉండటంవల్ల, దాని ప్రభావంతో అలా ఉన్నాడేమోలో అని సర్దిచెప్పుకొన్నాను. ఫామ్ గేటు వరకే వస్తానని, అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతానని అతడితో చెప్పాను. ఇంతలో నేను వెళ్లమన్నప్పుడే వెళ్లాలంటూ, కారు డోర్లు లాక్ చేశాడు. ఫాం వద్దకు చేరుకున్న తర్వాత అతడు నా వైపు వచ్చి, కారు డోర్ తీశాడు. నా జుట్టు పట్టుకొని లాగాడు. కారులోంచి కింద పడ్డాను. తలపై తన్నాడు. స్పృహ కోల్పోయాను.

తిరిగి స్పృహ వచ్చేసరికి, నేను ఆ ఫామ్ వెలుపలి క్వార్టర్స్‌లో ఉన్నాను. అతడు నాపై ఉన్నాడు. అతడి వెంట అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. నా మాజీ బాయ్‌ఫ్రెండ్ తర్వాత అతడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను మళ్లీ స్పృహ కోల్పోయాను. మళ్లీ స్పృహ వచ్చేసరికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ ఫామ్‌ను శుభ్రపరిచే ఓ మహిళ నా పక్కన కనిపించారు. బకెట్‌తో నీళ్లు తెచ్చుకున్న ఆమె నా శరీరాన్ని తుడిచేందుకు యత్నించింది. తన వస్త్రాలతో నా శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించింది. ఈ పని ఆపి, పోలీసులకు లేదా అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని ఆమెను అడిగాను. తర్వాత అంబులెన్స్ వచ్చింది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగిక దాడిలో నాకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వైద్యులు నా గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చింది. నేను ఇంత బాధలో ఉండగా, నాపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి బెయిలుపై విడుదలై, పారిపోయాడని తెలిసింది. ఏ హాని జరుగుతుందోననే ఆందోళన తొమ్మిది నెలలపాటు నన్ను వెంటాడింది. తర్వాత అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రొస్టేట్, మూత్రకోశ క్యాన్సర్‌తో 2017లో అతడు చనిపోయాడు. అప్పటివరకు అతడు ఏడేళ్లు జైల్లో ఉన్నాడు. ఏడేళ్లలో తొలిసారిగా అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. అతడి స్నేహితుడికి శిక్ష పడేలా కేసుపై ఎన్నడూ దృష్టి పెట్టలేకపోయాను. కేసు విచారణతో మరోసారి కలిగే వేదనను నేను తట్టుకోలేను. అందుకే దానిపై దృష్టి పెట్టలేదు. మా మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చి నాపైన, నా పిల్లలపైన దాడికి పాల్పడ్డట్లు పీడకలలు వచ్చేవి. నేను చిన్నప్పుడు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ వేధింపులు, నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చేసిన లైంగిక దాడి ప్రభావం నుంచి బయటపడేందుకు సంవత్సరాలపాటు చికిత్స కూడా తీసుకొన్నాను. నాకు జరిగిందే నా కుమార్తెలకు జరిగితే నేను తట్టుకోలేను. వారి భద్రత గురించి విపరీతంగా ఆందోళన చెందుతుంటాను. వాళ్ల ప్రతి కదలికను గమనిస్తుంటాను. వీలైనంత వరకు, వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాను. వారి వెంటే ఉంటుంటాను. దక్షిణాఫ్రికాలో మహిళలు, చిన్నారుల రక్షణకు అవసరమైన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం” అంటూ తన ఆడేవాడనను వెలిబుచ్చారు. నేను రేప్ కు గురయ్యా… ఇప్పుడు నా పిల్లల గురించి భయపడుతున్నా…

దక్షిణాఫ్రికాలో మహిళలపై అత్యాచార ఘటనలు గణనీయంగా పెరిగాయి. అందుబాటులో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గణాంకాల ప్రకారం- 2016లో మహిళల హత్యల రేటు అత్యధికంగా ఉన్న దేశాల్లో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉందని బీబీసీ రియాలిటీ చెక్ బృందం గుర్తించింది. 2016లో దక్షిణాఫ్రికాలో ప్రతి లక్ష మంది మహిళలకు 12.5 మంది చొప్పున హింస కారణంగా చనిపోయారు. 183 దేశాల అంతర్జాతీయ సగటు కేవలం 2.6 మందిగా ఉంది. లెసూటు, జమైకా, హొండురస్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 2016లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికాలో తొమ్మిది అత్యాచారాల్లో ఒకటే పోలీసుల దృష్టికి వస్తోంది. హత్యల రేటులో దక్షిణాఫ్రికా నాలుగో స్థానంలో ఉంది.

ఈ అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ దక్షిణాఫ్రికా ప్రజలు వీధుల్లో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. #AmINext అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో, ఇతర ఆన్‌లైన్ వేదికల్లో ఉద్యమిస్తున్నారు. దేశంలో మరణ శిక్షను తిరిగి ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఒక ఆన్‌లైన్ పిటిషన్‌పై ఐదు లక్షల మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా సెప్టెంబరు 13న జోహన్నెస్‌బర్గ్‌లో భారీ ప్రదర్శన జరిగింది. దక్షిణాఫ్రికా లైంగిక హింసపై ఆందోళన చెందుతున్న మహిళల్లో జోహన్నెస్‌బర్గ్‌లోని ఫొటోగ్రాఫర్ సారా మిడ్‌గ్లే ఒకరు. 37 ఏళ్ల సారాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాదాపు దశాబ్దం క్రితం ఆమె అత్యాచారానికి గురయ్యారు. అది మిగిల్చిన మనోవేదన నుంచి ఆమె నేటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

2010లో నా మాజీ ప్రియుడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సమయంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు శారీరకంగా, మానసికంగా దాదాపు 18 నెలలపాటు అతడు నన్ను క్షోభకు గురిచేయడంతో నేను అతడికి దూరమయ్యాను. నేను దూరమయ్యేందుకు యత్నించిన ప్రతిసారి అతడు మరింత హింసాత్మకంగా ప్రవర్తించేవాడు. తన్నేవాడు, కొన్నిసార్లు గొంతు నులిమేవాడు, కొరికేవాడు. తనను వదిలేసి వెళ్తే, నా ఇద్దరు కుమార్తెలను అత్యాచారం చేసి, నా కళ్ల ముందే చంపేస్తానని బెదిరించేవాడు. కొన్నిసార్లు విద్యుత్ షాక్ కూడా ఇచ్చాడు. నేను ఇదంతా ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. అప్పటికే విడాకులు తీసుకొన్న నాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు అంత విలువిచ్చేవారు కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు నన్ను పట్టించుకోరని నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చెప్పేవాడు.

చివరకు ధైర్యం చేసి అతడికి దూరంగా వచ్చేశాను. ఓ పది రోజుల తర్వాత, అతడు నా ఇంటి ముందుకు వచ్చేశాడు. నేను దిగ్భ్రాంతి చెందా. దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉండే తన బంధువు ఫామ్ కు వెళ్లేందుకు డబ్బుల్లేవని, చివరిసారిగా తనకో సాయం చేయాలని అడిగాడు. తనను నా కార్లో తీసుకెళ్లి అతడి వద్ద వదిలేస్తే నా జీవితంలోంచి పూర్తిగా వెళ్లిపోతానని మాట ఇచ్చాడు. అది నమ్మడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. కారులో కొంత దూరం ప్రయాణం చేశాక నా మాజీ బాయ్‌ఫ్రెండ్ వాలకం నాకు అనుమానం కలిగించింది. అతడికి హెరాయిన్ తీసుకొనే అలవాటు ఉండటంవల్ల, దాని ప్రభావంతో అలా ఉన్నాడేమోలో అని సర్దిచెప్పుకొన్నాను. ఫామ్ గేటు వరకే వస్తానని, అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతానని అతడితో చెప్పాను. ఇంతలో నేను వెళ్లమన్నప్పుడే వెళ్లాలంటూ, కారు డోర్లు లాక్ చేశాడు. ఫాం వద్దకు చేరుకున్న తర్వాత అతడు నా వైపు వచ్చి, కారు డోర్ తీశాడు. నా జుట్టు పట్టుకొని లాగాడు. కారులోంచి కింద పడ్డాను. తలపై తన్నాడు. స్పృహ కోల్పోయాను.

తిరిగి స్పృహ వచ్చేసరికి, నేను ఆ ఫామ్ వెలుపలి క్వార్టర్స్‌లో ఉన్నాను. అతడు నాపై ఉన్నాడు. అతడి వెంట అతడి స్నేహితుడు కూడా ఉన్నాడు. నా మాజీ బాయ్‌ఫ్రెండ్ తర్వాత అతడు నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నేను మళ్లీ స్పృహ కోల్పోయాను. మళ్లీ స్పృహ వచ్చేసరికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ ఫామ్‌ను శుభ్రపరిచే ఓ మహిళ నా పక్కన కనిపించారు. బకెట్‌తో నీళ్లు తెచ్చుకున్న ఆమె నా శరీరాన్ని తుడిచేందుకు యత్నించింది. తన వస్త్రాలతో నా శరీరాన్ని కప్పేందుకు ప్రయత్నించింది. ఈ పని ఆపి, పోలీసులకు లేదా అంబులెన్స్‌కు ఫోన్ చేయాలని ఆమెను అడిగాను. తర్వాత అంబులెన్స్ వచ్చింది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. లైంగిక దాడిలో నాకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వైద్యులు నా గర్భాశయాన్ని తొలగించాల్సి వచ్చింది. నేను ఇంత బాధలో ఉండగా, నాపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి బెయిలుపై విడుదలై, పారిపోయాడని తెలిసింది. ఏ హాని జరుగుతుందోననే ఆందోళన తొమ్మిది నెలలపాటు నన్ను వెంటాడింది. తర్వాత అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. ప్రొస్టేట్, మూత్రకోశ క్యాన్సర్‌తో 2017లో అతడు చనిపోయాడు. అప్పటివరకు అతడు ఏడేళ్లు జైల్లో ఉన్నాడు. ఏడేళ్లలో తొలిసారిగా అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. అతడి స్నేహితుడికి శిక్ష పడేలా కేసుపై ఎన్నడూ దృష్టి పెట్టలేకపోయాను. కేసు విచారణతో మరోసారి కలిగే వేదనను నేను తట్టుకోలేను. అందుకే దానిపై దృష్టి పెట్టలేదు. మా మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చి నాపైన, నా పిల్లలపైన దాడికి పాల్పడ్డట్లు పీడకలలు వచ్చేవి. నేను చిన్నప్పుడు కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ వేధింపులు, నా మాజీ బాయ్‌ఫ్రెండ్ చేసిన లైంగిక దాడి ప్రభావం నుంచి బయటపడేందుకు సంవత్సరాలపాటు చికిత్స కూడా తీసుకొన్నాను. నాకు జరిగిందే నా కుమార్తెలకు జరిగితే నేను తట్టుకోలేను. వారి భద్రత గురించి విపరీతంగా ఆందోళన చెందుతుంటాను. వాళ్ల ప్రతి కదలికను గమనిస్తుంటాను. వీలైనంత వరకు, వాళ్లు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంటాను. వారి వెంటే ఉంటుంటాను. దక్షిణాఫ్రికాలో మహిళలు, చిన్నారుల రక్షణకు అవసరమైన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం” అంటూ తన ఆడేవాడనను వెలిబుచ్చారు.

Related posts