telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మిల్క్ బ్యూటీ…!

15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. అప్పటినుండి మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది. ప్రస్తుతం తమన్నా కెరీర్ కాస్త డల్‌గా ఉన్నా ఆమె మళ్లీ తప్పక తన స్టార్ డమ్‌ను అందుకుంటారని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అయితే తమన్నాకు తన ప్రతిభను కనబరిచేందుకు ఓ సువర్ణ అవకాశం అందిందంట. లెంజెండరీ నటి జమున జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న సినిమాలో తమన్నా నటించనున్నారంట. అయితే జమున తన 16వ యేట సినిమాల్లోకి అరంగేట్రం చేశారు. తన అద్భుత నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లోనే దాదాపు అగ్రహీరోల అందరి సరసన నటించారు. సీనియర్ ఎన్‌టీఆర్, ఏఎన్ఆర్, ఎస్‌వీ రంగారావు ఇలా అందరికీ జోడీగా నటించారు. ఇప్పుడు ఈ గొప్పనటి జీవిత కథను తెలుగు వెండితెర మీదకు తీసుకురావాలని దర్శకుడు శివనాగు నర్రా ఆలోచన చేశారు. అందుకోసం సినిమా స్క్రిప్ట్‌ను సిద్దం చేశారంట. ఈ సినిమాలో జమున పాత్రకు తమన్నా చేయాలని అనుకున్నారంట. అందుకోసం తమన్నాతో సంప్రదించారంట. కానీ తమన్నా నిర్ణయం తెలియాల్సి ఉంది. ఇదివరకు సావిత్రి జీవిత కథతో కీర్తి సురేష్ మహానటిగా నిరూపించుకున్నారు. ఇప్పుడు అటువంటి గోల్డెన్ ఛాన్స్ తమన్నాకు చేరుతుంది. మరి తమన్నా ఈ సినిమాను ఓకే చేస్తారా చేయరా అనేది వేచి చూడాలి.

Related posts