telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆన్లైన్ లో విడుదల కానున్న షకీలా ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’

Shakila

నటి షకీలా సమర్పణలో వస్తున్న సినిమా ‘లేడీస్‌ నాట్‌ ఎలౌడ్‌’ అడల్ట్ కామెడీ హారర్. దీనిని రమేష్‌ కావలి నిర్మిస్తున్నారు. విక్రాంత్‌ రెడ్డి సహ నిర్మాత. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన సాయి రామ్ దాసరి గత సంవత్సరం ప్రముఖ నటి షకీలా సమర్పణలో లేడీస్ నాట్ ఎలౌడ్‌ అనే సినిమాను తెరకెక్కించారు. కానీ సెన్సార్ బోర్డు ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఈ వివాదాన్ని ఆయన ఢిల్లీ వరకు తీసుకెళ్లారు. కరోనా కారణంగా ఆ వివాద పరిష్కారం ఇప్పటికి ముగియలేదు. మరో పక్క సినిమా హాల్స్ ముసేసి ఇప్పటికే 100 రోజులు పైన గడిచింది. ఇప్పట్లో సినిమా హాల్స్ తెరుచుకునే అవకాశం కూడా లేకపోవడంతో సినిమాను నేరుగా ఆన్ లైన్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించుకుంది. సంవత్సర కాలంగా థియేటర్ రిలీజ్ కి నోచుకోలేని ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఆన్ లైన్ లో విడుదల కానుంది. జూలై 20న రాత్రి 8 గంటలకు www.ladiesnotallowed.com అనే వెబ్సైట్ లో చిత్రం విడుదల కానుంది. సినిమా చూసేందుకు 50 రూపాయలు చెలించాల్సి ఉంటుందని చిత్ర బృందం తెలిపింది.

Related posts