telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నెట్‌ఫ్లిక్స్‌ లో ఉప్పెన…

uppena

భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఉప్పెనా. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ల తొలి పరిచయం అయినప్పటికీ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసాడు. హీరోయిన్ కృతికి కూడా ఇదే తొలి సినిమా. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లో విడుదలైన సంగతి తెలిసిందే. కథ పాతదే అయినప్పటికీ దర్శకుడు బుచ్చిబాబు అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓటీటీలో అతి త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 7 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. చిత్రబృందం ట్రైలర్ విడుదలకు ముందే నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకుందంట. ఆ ఒప్పందం ప్రకారం థియేటర్లలో విడుదలైన 60రోజుల తరువాత సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. ఈ ప్రకారం చూసుకుంటే ఈ సినిమా ఏప్రిల్ 11న ఓటీటీలో రిలీజ్ అయ్యేందకు అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది అనేది.

Related posts