టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో కార్తికేయ. అయితే ఇప్పుడు కార్తికేయ హీరోగా తెరకెక్కతున్న సినిమా చావుకబురు చల్లగా. ప్రస్తుతం మంచి బజ్ ఉన్న సినిమాల్లో ఇది ఒక్కటి. ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అంతకు అంతా పెంచాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో లిరికల్ పాట విడుదలైంది . ‘కదిలే కాలాన్నడిగా’ అంటూ సాగే పాట అభిమానుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో లావణ్య త్రిపాఠీ హీరోయిన్‌గా చేస్తున్నారు. అయితే ఈ మూవీలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’, లావణ్య త్రిపాఠి ‘మల్లిక’ పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని కౌషిక్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇందులో బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమా అభిమానులను మెప్పిస్తుందా.. వారు సినిమా పై పెట్టుకున్న అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.
previous post
next post