రెండో టెస్టులో భాగంగా భారత ఆటగాడు హనుమ విహారి సెంచరీ దిశగా సాగుతున్నాడు. విహారి తొలి సెషన్ చివరికి 84 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. విహారికి తోడుగా ఇషాంత్ శర్మ 11 పరుగులతో ఆడుతున్నాడు. రెండో రోజు ఆట ప్రారంభంచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 118 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.
ఆటలో కెప్టెన్ విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక పంత్ కూడా రెండో రోజు ఆటలో ప్రారంభంలోనే పెవిలియన్ చేరాడు. విహారి లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అండతో ఇన్నింగ్స్ నడిపిస్తున్నాడు.