telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కార్తికేయ-2’లో తెలుగు హీరోయిన్

Ritu-Varma

టాలెటెండ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘కార్తికేయ-2‘ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. కాగా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే హిస్టారికల్ కి సంబంధించిన ఓ కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. నిఖిల్ ‘కార్తికేయ 2’లో ‘రీతూ వర్మ’ నటించబోతుందట. ఇక ఇప్పటికే ‘రీతూ వర్మ’ శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక సెట్స్‌ మీద నాని ‘టక్‌ జగదీష్‌’ సినిమా కూడా ఉంది ఆమె చేతిలో. వచ్చే నెల నుండి ఈ సినిమా కోసమే డేట్స్ కేటాయించదట. తెలుగు హీరోయిన్ ‘రీతూ వర్మ’ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తోంది.

Related posts