telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులు..వరుడుతో సహా ఐదుగురి అరెస్ట్

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి ఊరేగింపులో డ్యాన్సులతో హోరెత్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వరుడుతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలో ఈ నెల 2న వివాహం జరగ్గా అనంతరం పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వారు ఒక్కరు కూడా మాస్కు ధరించకుండా భౌతిక దూరాన్ని గాలికి ఒదిలేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఇది కాస్తా అధికారుల దృష్టికి చేరడంతో తీవ్రంగా పరిగణించిన అధికారులు వివాహం జరిగిన ‘హోటల్ మై ఫెయిర్’ను సీజ్ చేయడంతోపాటు వరుడు, అతడి తండ్రి, ముగ్గురు మామయ్యలను అరెస్ట్ చేశారు. అలాగే, పెళ్లి ఊరేగింపులో పాల్గొన్న రెండు వాహనాలను సీజ్ చేసినట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.

Related posts