telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అనూహ్య నిర్ణయం.. ఇక నుండి…?

prashanth kishofre

ప్ర‌శాంత్ కిషోర్ కు భారత్ లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా మంచి పేరు ఉంది. అయితే అనేక పార్టీల‌కు ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప‌ని చేసిన ఆయన తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక తాను రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. అయితే ప్ర‌స్తుతం పశ్చిమ బెంగాల్‌లో మ‌మ‌త బెన‌ర్జీ పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ 100 కు లోపే ఉంటుందని.. ఒకవేళ బీజేపీ 100 దాటితే తాను ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్తగా ప‌నిచేయ‌న‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అయింది. అయితే ప‌శ్చిమ బెంగాల్‌తో పాటు ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో డిఎంకెకు కూడా ఆయ‌న వ్యూహ‌క‌ర్త‌గా ప‌నిచేశారు. 2014లో న‌రేంద్ర‌మోడి కి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించి దేశందృష్టిలో నిలిచాడు ప్ర‌శాంత్ కిషోర్‌. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో చర్చగా మారింది.

Related posts