telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

నేడు పెరిగిన బంగారం, వెండి ధరలు…

Gold rates hike

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో, హైదరాబాద్ లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 650 పెరిగి రూ. 51,180 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 590 పెరిగి రూ. 46,000 పలుకుతోంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ. 47,840 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 43,850 పలుకుతోంది. అటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 1,300 పెరిగి రూ. 75,700 కి చేరింది.

Related posts