telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఇల్లు కాలిపోతుంటే… చుట్టకి నిప్పు దొరికిందనుకోవటం అంటే ఇదే…

man created accident costs 60 lives

ప్రమాదం జరిగితే ప్రథమచికిత్స మాట దేవుడెరుగు, సెల్ఫీలు దిగే ఛండాలమైన విషసంస్కృతిలోకి అడుగుపెట్టేశాం. తాజాగా అది మరోసారి నిరూపితం అయ్యింది. అసలే ప్రమాదం జరిగితే, దొరికింది దొరికినట్టు తీసుకెళ్ళేవాళ్ళు తయారయ్యారు.. వీళ్ళని మించిపోయిన మరొకడు, ఇల్లు కాలుతుంటే, చుట్టకి నిప్పు దొరికిందనుకున్నట్టుగా ఇంకా వికారంగా ప్రవర్తించాడు. దానితో 60మంది సజీవదహనం అయ్యారు. వివరాలలోకి వెళితే, ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది.. గుంపులుగా వచ్చి ఆయిల్ పట్టుకొని వెళ్తున్నారు.. ట్యాంకర్ బోల్తా పడిందంటేనే జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో ఓ వ్యక్తి చేసిన తప్పిదం 62 మంది ప్రాణాలు తీసింది.

ఈ ఘోర ప్రమాదం టాంజానియాలో జరిగింది. టాంజానియా రాజధాని దార్‌ ఎస్‌ సలామ్‌కు పశ్చిమంగా వున్న మొరగొరోలో ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది.. ఇక ప్రమాదానికి గురైన ట్యాంకర్‌ నుంచి స్థానికులు పెట్రోల్‌ తీసుకెళ్లేందుకు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి సిగరెట్ ముట్టించడంతో.. 62 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 70 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. ఈ ఘటనలో 62 మంది మృతిచెందినట్టు నిర్ధారించారు పోలీసులు.

Related posts