telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి… : రామ్ చరణ్

Rangasthalam

శుక్రవారం కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా తనదైన సత్తాను చాటింది. జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు ఏడు అవార్డులు రావడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. సినీ సెలబ్రీలు అందరూ అవార్డ్ విన్నర్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ జాతీయ అవార్డులను సాధించిన అందరినీ అభినందిస్తూ ఫేస్ బుక్ ద్వారా మెసేజ్‌ను పోస్ట్ చేశారు. “66వ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న `అ!`, `చి.ల.సౌ`, `మహానటి`, `రంగస్థలం` మేకర్స్‌కు అభినందనలు. తెలుగు సినిమా గర్వపడే క్షణాలివి. మన సినిమా వెలుగుతుంది. క్వాలిటీ సినిమాను అందించడంలో మనం పెడుతున్న ఎఫెక్ట్స్ గుర్తింపు దక్కింది” అని అన్నారు. అయితే “రంగస్థలం” చిత్రానికి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో జాతీయ అవార్డు ఇచ్చి సరిపుచ్చారు. దీంతో రాంచరణ్ ఉత్తమ నటుడిగా అన్ని విధాలా అర్హుడంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

Related posts