telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ నిర్వాహకులకు ఊరట

Bigg-Boss

బిగ్‌బాస్-3 పై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం చుట్టూ ఇటీవల వివాదాలు ముసురుకున్నాయి. షోను ఆపేయాలంటూ ఆందోళనలు జరిగాయి. ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నటుడు అక్కినేని నాగార్జున ఇంటి వద్ద ఇటీవల విద్యార్థి జేఏసీ నాయకులు ఆందోళనకు దిగారు. షోను నిలిపివేయాలని నినాదాలు చేశారు. కాగా, బిగ్‌బాస్-3 పేరుతో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ యాంకర్ శ్వేతారెడ్డి ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్‌ బాస్ షో నిర్వాహకులకు నాంపల్లి కోర్టులో పెద్ద ఊరట లభించింది. బిగ్‌ బాస్ కోఆర్డినేటర్లు అభిషేక్, రవికాంత్, రఘుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులతో బిగ్ బాస్ నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. అవకాశాల పేరుతో బిగ్‌ బాస్ షో నిర్వాహకులు అమ్మాయిలకు వల వేస్తున్నారంటూ, తమను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ నటి గాయత్రి గుప్తా, శ్వేతా రెడ్డి బంజారాహిల్స్, రాయదుర్గం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తమకు న్యాయం చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించారు. బిగ్ బాస్ షోను అడ్డుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా బిగ్‌బాస్ షో నిర్వాహకులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వారి ఆరోపణలన్నీ అవాస్తవం అని వివరించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కేసుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, అప్పటి వరకు బిగ్‌బాస్ షో నిర్వాహకులను అరెస్ట్ చేయవద్దని పోలీసు శాఖను ఆదేశించింది. అయితే దీనికి ముందే ముందస్తు బెయిల్ కోరుతూ బిగ్‌బాస్ షో నిర్వాహకులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన నాంపల్లి కోర్టు.. వారికి బెయిల్ మంజూరు చేసింది.

Related posts