telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదును పెడుతున్న సమంత

Samantha

ఈ లాక్‌డౌన్‌ సమయంలో కావాల్సినంత విరామం దొరకడంతో అక్కినేని వారి కోడలు సమంత తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి పదును పెడుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా వంట క్లాసులకు హాజరవుతోంది. నగరంలో పేరుమోసిన ఓ ఆహారనిపుణుడి ఆధ్వర్యంలో వంట చేయడంలో శిక్షణ తీసుకుంటోంది. నోరూరించే సూప్స్‌తో పాటు ఆరోగ్యపరంగా సమతుల ఆహారాన్ని తయారుచేయడం నేర్చుకుంటోంది. కేవలం వంటలో శిక్షణతోనే సరిపెట్టుకోకుండా ఇంటివద్ద టెర్రస్‌పై ప్రత్యేకంగా ఆకుకూరల్ని కూడా పండిస్తోంది సమంత. తాను స్వయంగా సిద్ధం చేసిన పాస్తా, శాక్షూకా వంటి విభిన్న వంటకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ తన పాకశాస్త్ర ప్రావీణ్యానికి మురిసిపోతోంది. వంటలో సమంత కనబరుస్తున్న శ్రద్ధాసక్తుల్ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Related posts