telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరోయిన్ నోటి వెంట బూతులు… సోషల్ మీడియాలో ట్రెండ్…!?

Neha

2002లో మిస్ ఇండియా యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ అవకాశాలు తలుపు తట్టాయి. 2003లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘ఖయామత్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఈ భామ అందాల ఆరబోతకు స్క్రీన్ వేడెక్కింది. ఆ తర్వాత జూలీ (2004) సినిమాతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది. చాలా సినిమాలు చేసిన ఈ బ్యూటీ అంగద్ బేడిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం రోడీస్ రెవల్యూషన్ అనే ప్రోగ్రామ్‌కు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తోంది. తాజాగా నేహా ఈ  ప్రోగ్రామ్‌లో నేహా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగుతున్నాయి.ఈ షోలో ఒక కంటెంస్ట్‌ తన గర్ల్ ఫ్రెండ్‌ తనతో పాటు ఐదుగురు బాయ్ ఫ్రెండ్స్‌ ‌తో డేటింగ్ చేస్తూ ఛీట్ చేసిందన్నారు. ఈ విషయం తెలిసి నాకు కోపమొచ్చి ఆమెను లాగి ఓ చెంప దెబ్బకొట్టాను అని తన బాధను వెల్లబోసుకున్నాడు. దానికి టీమ్ లీడర్‌గా ఉన్న నేహా దుపియా ఆమెను నువ్వు కొట్టడం తప్పు.. ఆమె ఎంత మందితో తిరిగితే నీకేంటి ? డేటింగ్ చేస్తే నీకెంటి ? అది ఆమెకున్న స్వేచ్ఛ? ఆమె స్వేచ్ఛను ప్రశ్నించడానికి నీవెవరు ? అంటూ కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలపై ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి నేహా తన కామెంట్స్ తో ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు.

Related posts