telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనాధ పిల్లలకు సహాయం చేస్తానంటున్న… మంచు మనోజ్

Manchu-Manoj

సోషల్ మీడియాలో ఎవరికైనా సమస్యలు ఉంటే వెంటనే స్పందిస్తారు మంచు మనోజ్. తాజాగా ఫిల్ ది హంగర్ అనే ఫౌండేషన్‌ను నడుపుతున్న రాకేష్ అనే నెటిజన్ మంచు మనోజ్ హెల్ప్ కోరడంతో అభయ హస్తం అందిస్తానని మాట ఇచ్చారు మంచు మనోజ్. ఇంతకీ నెటిజన్ ఏం కోరారంటే.. ‘మంచు మనోజ్ అన్నా నేను ఫౌండేషన్ స్టార్ట్ చేశా.. చిన్న పిల్లల చదువుకోసం స్టేషనరీ ఇవ్వడం, పేదలకు అన్నంపెట్టడం చేస్తుం మీరు చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా అందుకే నేను మిమ్మల్ని హెల్ప్ అడిగా మాకు ఫౌండేషన్‌‌కి ప్రమోషన్ అండ్ డొనేషన్ ఇప్పిస్తారని కోరుతున్నా అన్నా దయచేసి రెస్పాండ్ అవ్వండి’ అని మంచు మనోజ్‌ను ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టాడు నెటిజన్. ఈ ట్వీట్‌పై మంచు మనోజ్ వెంటనే స్పందిస్తూ.. ‘హాయ్ తమ్ముడూ దయచేసి నీ పూర్తి వివరాలు, నువ్ ఫౌండేషన్‌కి సంబంధించిన వివరాలను క్లియర్‌గా నాకు పంపు.. నా వాళ్లు కొంతమంది రేపు విజట్ చేస్తారు.. టేకేర్ తమ్ముడూ’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts