telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

మోడీ ‘షో’ కి … తెచ్చిపెడుతున్న రేటింగ్స్..

modi man vs wild show got high ratings

బ్రిటన్‌కు చెందిన సాహస వీరుడు బేర్‌ గ్రిల్స్‌ భారత ప్రధాని మోదీతో కలిసి చేసిన మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమానికి భారీగా ప్రేక్షకాదరణ లభించింది. సమాచార ప్రసార రంగంలోనే (ఇన్ఫోటైన్‌మెంట్‌) రికార్డు స్థాయిలో రేటింగ్‌ పొందిన కార్యక్రమంగా ఈ ఎపిసోడ్‌ నిలిచింది. ఈ నెల 12న దాదాపు 12 డిస్కవరీ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమం ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దేశంలో 6.1 మిలియన్ల టీవీల్లో డిస్కవరీ ఛానెల్‌ చూస్తున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన సరాసరి సమయం కూడా అత్యధికంగా 29.2 నిమిషాలుగా ఉందని వెల్లడైంది.

ఈ కార్యక్రమం ప్రభావంతో డిస్కవరీ ఛానెల్‌ ఒక్కసారిగా 3.05 ఇంప్రెషన్లను సాధించి మూడో స్థానానికి ఎగబాకింది. స్టార్‌ ప్లస్‌ 3.67 మిలియన్‌ ఇంప్రెషన్లు, జీటీవీ 3.3 ఇంప్రెషన్లతో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌ కార్బెట్‌ జాతీయ పార్క్‌లో మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్క్‌వర్క్‌పై కార్యక్రమం ప్రసారమైంది.

Related posts