telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలు: కన్నా ఫైర్

Kanna laxminarayana

వైసీపీ వంద రోజుల పాలన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శనాస్త్రాలు సందించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పాలనపై సీఎం జగన్ పట్టు కోల్పోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధికి స్థానం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం విషయంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రోజురోజుకు రాష్ట్ర పరిస్థితి దిగజారుతోందని చెప్పారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో జగన్ అవగాహనారాహిత్యం స్పష్టమవుతుందని కన్నా దుయ్యబట్టారు. గతంలో జగన్ చెప్పిన మాటలకు, ప్రస్తుతం చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందన్నారు. జన్మభూమి కమిటీల పేర్లను మార్చి గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చారని కన్నా అన్నారు. వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగాలిచ్చే వ్యవస్థను తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ సొంత పార్టీ కార్యకర్తలకు ఉపాధి మాత్రమేనని అన్నారు. మీరు కల్పించిన ఉద్యోగాల కంటే ఎక్కువ మందిని రోడ్డున పడేశారని మండిపడ్డారు.

Related posts