telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువ సంగీత దర్శకుడి హఠాన్మరణం

Naveen-Shankar

యువ సంగీత దర్శకుడు నవీన్ శంకర్ హఠాన్మరణంతో కోలీవుడ్ షాక్ కు గురైంది. అక్టోబర్ 31న రాత్రి నవీన్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో అతడి బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్లు తేలింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే నవీన్ కన్నుమూశారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా తేలింది. నవీన్ హఠాన్మరణంతో కోలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా 2018లో ‘విసిరి’ చిత్రానికి సంగీతం అందించిన నవీన్‌.. పలు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అందించారు. శ్రీకాంత్, చంద్రిక రవి నటించిన థ్రిల్లర్ ‘ఉన్ కాదల్‌ ఇరుందల్’‌కి నవీన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

Related posts