telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకుంటున్నారు : మీరా చోప్రా

Meera-chopra

టాలీవుడ్ లో ఎప్పుడో కనుమరుగైన మీరా చోప్రా ఇటీవల అనూహ్యరీతిలో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదంటూ ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన దగ్గర నుంచి ఈ అమ్మడిని అందరు తేలికగా గుర్తుపడుతున్నారు. ఇటీవల ముంబైలోని సెక్స్ వర్కర్లు దారుణమైన స్థితిలో ఉన్నారని.. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందించడం లేదని ఓ సోషల్ యాక్టివిస్ట్ పెట్టిన ట్వీట్ పై స్పందించిన మీరా చోప్రా… ”కమాతిపుర అనే సిరీస్ లోనే నటించే క్రమంలో సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవన పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకోవడం అనేది అత్యంత బాధకరమైన విషయం” అని ఎమోషనల్ ట్వీట్ చేసింది మీరా చోప్రా.

Related posts