telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మనీషా కొయిరాల వివాదాస్పద ట్వీట్… నేపాల్ వెళ్లిపొమ్మంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు

Manisha

ఆ భారత భూభాగాలు నేపాల్‌వే అంటూ మనిషా కోయిరాల చేసిన కాంట్రవర్సియల్ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ ఓ కొత్త మ్యాప్‌ను రిలీజ్ చేసింది. మే 18వ తేదీన ఈ మేరకు నేపాల్ కేబినెట్ రిలీజ్ చేసింది. ఆ కొత్త మ్యాప్‌కి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. నేపాల్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి సీనియర్ హీరోయిన్ మనీషా కోయిరాలా ఇప్పుడు మద్దతు పలికింది. ఆ మూడు పట్టణాలను తమదిగా పేర్కొంటూ నేపాల్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్ గ్యావాలీ చేసిన ట్వీట్‌ను.. మనిషా కోయిరాల రీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘మన చిన్న దేశం స్వాభిమానాన్ని కాపాడినందుకు థాంక్స్. దీనిపై మూడు గొప్ప దేశాల మధ్య శాంతియుతమైన, గౌరవప్రదంగా చర్చలు జరుగుతాయని ఎదురుచూస్తున్నాను’ అని మనిషా ట్వీట్ చేసింది. అయితే మనిషా చేసిన ట్వీట్‌పై ఆమె నేపాల్ కు వెళ్లిపోవాలంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

Related posts