telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిహార్ ఫలితాలపై తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు..

బిహార్‌ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందని ఆరోపణలు చేశారు. అయితే… ఇలాంటి తప్పు ఇదేం మొదటి సారి కాదని పేర్కొన్నాడు తేజస్వీ యాదవ్‌. 2015 ఎన్నికల్లోనూ ఇలాగే ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా పలితాలు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారని…కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుందని ఆరోపించారు. కాగా.. ఎన్డీఏకే పట్టం కట్టారు బీహార్ ప్రజలు. మరోసారి సుశాసన్ బాబు నితీష్‌.. సీఎంగా ఎన్నిక కానున్నారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌.. తన సత్తా చాటారు. చివరివరకూ ఎన్డీఏకు గట్టిపోటీ ఇచ్చారు. ఎల్జేపీ పెద్దగా సీట్లు సాధించకున్నా.. గణనీయంగా ఓట్లు చీల్చింది. మొత్తం 243 స్థానాలకుజరిగిన ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించింది. 125 స్థానాలు గెల్చి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహాఘట్‌ బంధన్‌ 110 స్థానాలు సాధించింది.

Related posts