telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెట్ ఎయిర్ వేస్ పై కాజల్ ఆగ్రహం

KAJAL AGARWAL Images

ఇటీవల కాలంలో విమానయాన సంస్థల తీరుతో సెలెబ్రిటీలు తరచూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ పై మండిపడ్డారు. ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నామని, కౌంటర్ స్టాఫ్ అయిన మోయిన్ అనే వ్యక్తి తమ సమయాన్ని వృథా చేశాడని ఆరోపించింది. ఆ తరువాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్మినల్ వద్దకు విమానాన్ని తీసుకువచ్చారని, ఆ తరువాత మరో 30 నిమిషాల పాటు విమానాన్ని అక్కడే పార్క్ చేశారని, డోర్లను కూడా గంటసేపు మూసే ఉంచారని, ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తాము చాలా ఇబ్బంది పడ్డామని చెప్పుకొచ్చింది. జెట్ ఎయిర్ వేస్ విమాన సిబ్బంది తమ ప్రవర్తనతో ప్రయాణికుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది కాజల్.

Related posts