telugu navyamedia
సినిమా వార్తలు

“Mr బెగ్గర్”గా బర్నింగ్ స్టార్ సంపూ…

‘హృదయ కాలేయం’ అనే సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అయిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు స్ఫూఫ్ సినిమాలు.. విచిత్రమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఎన్నో చిత్ర విచిత్రమైన పాత్రలతో విభిన్నమైన గుర్తింపును అందుకున్నాడు.

ఇటీవలే క్యాలీ ఫ్లవర్ సినిమా విడుదలై ప్రేక్షకులను నవ్వులతో పులకరించేలా చేసింది. ఇప్పుడు తాజాగా ఈ నూతన సంవత్సరం సందర్భంగా “Mr బెగ్గర్” సినిమా షూటింగ్ ప్రారంభం త్వరలో కానుంది. కార్తీక్ మూవీస్ పతాకంపై వడ్ల జనార్దన్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.

ఈ చిత్రాన్ని నిర్మాతలు గురురాజ్, కార్తిక్ వడ్ల నిర్మిస్తున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రానికి పెద్దపల్లి రోహిత్ సంగీతం అందిస్తున్నారు.

Related posts