telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“లక్ష్మీబాంబ్” టైటిల్ మార్పు… కొత్త టైటిల్ ఇదే…!

Laxmi

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా ఈ సినిమాకు ఎదురు దెబ్బ తగిలింది. ఈ సినిమా ఈ గురువారం సెన్సార్ సర్టిఫికెట్ కోసం వెళ్లింది. ప్రేక్షకుల మనో భావాలను, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా టైటిల్ ను మార్చాలని నిర్మాతలకు సూచించారు సెన్సార్ బోర్డు సభ్యులు. దాంతో ఈ సినిమా టైటిల్ ను మార్చారు నిర్మాతలు. ఈ హర్రర్ కామెడీ సినిమాగా తెరకెక్కనున్న సినిమాకు “లక్ష్మీ బాంబ్” అనే పేరును తొలగించి “లక్ష్మీ” అని పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రీమియర్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 9 నుంచి ప్రసారం కానుంది. 

Related posts