telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజనీకాంత్ ‘అన్నాతే’ లో విలన్ గా గోపీచంద్…

rajani

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. రజనీ నటిస్తున్న 168వ సినిమా ఇది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.లేడి సూపర్ స్టార్ నయనతార ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకు ‘అన్నాతే’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దర్శకుడుగోపీచంద్ ని సంప్రదించగా ఓకే చెప్పినట్టు సమాచారం. గోపిచంద్ హీరోగా నటించిన ‘శౌర్యం’ సినిమాతోనే శివ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత వీళ్ల కలయికలో ‘శంఖం’ చిత్రం వచ్చింది. శివ ప్రస్తుతం తమిళనాట స్టార్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. అజిత్‌తో ఏకంగా నాలుగు సినిమాలు చేసి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. ఈ పరిచయం కారణంగా గోపి, శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ‘జయం’, ‘వర్షం’, ‘నిజం’ సినిమాల్లో గోపిచంద్ విలన్ పాత్రల్లో మెప్పించన సంగతి తెలిసిందే.

Related posts