telugu navyamedia
సినిమా వార్తలు

కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌-ఎన్టీఆర్ 31 కొత్త మూవీ అప్డేట్‌..

జూనియర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా అభిమానులకు వరుస ట్రీట్‌లు వస్తున్నాయి. ఇప్పటికే తారక్‌ పలు డైరెక్టర్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ పూర్తి చేసుకోవడం తన తదుపరి ప్రాజెక్ట్స్‌ను వరసగా ప్రకటిస్తున్నాడు.

ఇక తన 30వ సినిమాను కొరటాల శివతో చేస్తుండగా..ఎన్టీఆర్‌ 31 చిత్రానికి కేజీయఫ్ డైరెక్ట ర్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించబోతున్నాడని స్పష్టమైంది.

ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ను తాజాగా ప్రశాంత్‌ నీల్‌ షేర్‌ చేశాడు. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ సంబంధించిన ఫస్ట్‌ పోస్టర్‌ను వదిలారు. ‘హ్యాపీబర్త్‌డే ఎన్టీఆర్‌ 31’ ప్రశాంత్‌ నీల్‌ ట్యాగ్‌లైన్‌తో ఉన్న పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

ఇందులో తారక్ సీరియ‌స్ లుక్‌లో కనిపించాడు. ఫేస్ మొత్తంగా కాకుండా.. సగం మాత్రమే కనిపిస్తోంది. ఆ ముఖంలో ఎక్కడ లేని కోపం కూడా కనిపిస్తోంది.

ఈ పోస్ట్‌కు ‘రక్తంతో తడిచిన నేల మాత్రమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఆయన నేల.. ఆయన వారసత్వం మాత్రమే గుర్తుంటాయి. అతని రక్తం కాదు’ అంటూ ప్రశాంత్‌ నీల్‌ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ చూసిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఎన్టీఆర్‌ 31 అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఎన్టీఆర్‌ లుక్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

Related posts