సినీ నటుడు, సామాజిక వేత్త ఆర్. నారాయణ మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ ప్రశంసలు కురిపించారు. ఏపీలో సీఎం జగన్ తీసుకువస్తున్న పథకాలు అద్భుతమని కొనియాడారు. ముఖ్యంగా ఇంగ్లీష్- మీడియం విద్యను భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉచిత ఇంగ్లీష్ మీడియం విద్య తీసుకు రావడం సీఎం జగన్ గొప్పతనమని పేర్కొన్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు ఆర్ నారాయణ మూర్తి. సీఎం కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు కీలక ఘట్టమని పేర్కొన్నారు. దేశంలో ఏ నాయకుడు చేయని పనులు సీఎం కేసీఆర్ చేశాడన్నారు. ముఖ్యంగా రైతుబంధు కార్యక్రమం ఎంతో గొప్ప పథకమని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలపై కూడా ఆర్ నారాయణ మూర్తి స్పందించారు. వ్యవసాయాన్ని కార్పోరేట్ చేతుల్లో పెట్టడానికే కేంద్రం ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. రైతుల ఉద్యమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కేంద్రం మెడలు వంచైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు దిశగా పోరాడాలని తెలిపారు.
previous post
next post
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని