telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బుట్ట బొమ్మ సాంగ్ కి స్టెప్పులు ఇరగదీసిన డేవిడ్ వార్నర్ దంపతులు..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ పాట బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా గంతులేసేంతగాఫేమస్ అయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించిన వార్నర్ తన సతీమణితో కలిసి ఈ పాటకు టిక్‌టాక్‌ చేశాడు. వెనకాల తన కూతురు కూడా అటూ ఇటూ తిరుగుతూ హల్ ‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

It’s tiktok time #buttabomma get out of your comfort zone people lol @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

Related posts