telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిహారిక పెళ్ళికి ముహూర్తం ఫిక్స్

Niharika

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నీహారికకు మెగాస్టార్ అభిమానులే కాకుండా ప్రత్యేకమైన అభిమానులున్నారు. టీవీ షోలలో తనదైన ముద్రతో ఒక ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు నిహారిక. తాజాగా నిహారిక కొణిదెల పెళ్లి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 9వ తేదీ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు. వీరి వివాహం రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో జరగనుంది. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుంటూరు ఐజీ జె.ప్రభాకరరావు వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం వివాహ తేదీ, వేడుకను ఖరారు చేసినట్లు ప్రకటించారు. కాగా ఆగష్టులో నిహారిక, చైతన్యల నిశ్చితార్ధ వేడుకను ఆగస్టు 13 (గురువారం) సాయంత్రం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబం, సన్నిహితులు హాజరయ్యారు.

Related posts