telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పవర్ స్టార్ తో ఆ హీరోయిన్ రెండోసారి నటించనుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా టీజర్ ను దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తుంది. ఆ తరువాత డైరెక్టర్ క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఓ పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా నటిస్తున్నాడని కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కాగా ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతం ఉందట. ఇక ఓ యువతి పవన్ ప్రేమలో పడుతుందని.. కాగా ఆ ప్రేమించే హీరోయిన్‌గా ప్రణీత సుభాష్ నటించబోతుందని తెలిసింది. ఇప్పటికే ఈ భామ ‘అత్తారింటికి దారేది’లో పవన్ మరదలుగా నటించి మైమరపించింది. ఇప్పుడు ఆమె మరోసారి పవర్‌స్టార్ మూవీలో నటించనుందట. కాగా పిరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే చిత్రమిది. ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అఫీషియల్ ఆప్డేట్ వెలువడలేదు.

Related posts