telugu navyamedia
రాజకీయ వార్తలు

పాక్ హై కమిషన్ ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలి: భారత్ కీలక నిర్ణయం

pak agreed to discuss on kartharpur issue

భారత్-పాక్ దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషన్ కార్యాలయంలోని సగం మందిని వారం రోజుల్లోగా తొలగించాలని విదేశాంగ శాఖ ఆదేశించింది.న్యూఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలోవిధులు నిర్వహిస్తున్న పాకిస్థాన్ ఉద్యోగుల్లో సగం మందిని వెనక్కు పంపించాలని భారత్ కోరింది. ఇదే సమయంలో ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం నుంచి కూడా సగం మందిని తగ్గించనున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది.

పాకిస్థాన్ హై కమిషన్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని పదేపదే ఆరోపణలు చేస్తున్నా, హై కమిషన్ తీరు మారడం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. వియన్నా ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడటం లేదని, తెలిపింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని చెప్పారు. ఇటీవలే ఇద్దరు పాక్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని విదేశాంగ శాఖ తెలిపింది. వారిని మే 31న దేశం నుంచి బహిష్కరించామని పేర్కొంది.

Related posts