telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4 : మొదటి వారమే నామినేషన్ లో గంగవ్వ…!

Gangavva

16 మంది సెలబ్రెటీలు బిగ్‌బాస్‌ 4 హౌస్‌లో అడుగు పెట్టడంతో సందడి మొదలైంది. బిగ్‌బాస్ హౌస్‌లో రెండవ రోజు మార్నింగ్ వేకప్ సాంగ్ ‘సయ్యా.. సయ్యోరే’ తో ఎపిసోడ్‌ మొదలైంది. ఆ పాటకు గంగవ్వతో సహా మిగిలిన కంటెస్టెంట్స్‌ అంతా స్టెప్పులేశారు. ఇక సీక్రెట్ రూంలో ఉన్నఅరియానా, సొహైల్‌ కూడా తమదైన శైలీలో స్టెప్పులేసి అలరించారు. అనంతరం కిచెన్‌లో డైరెక్టర్ రాజశేఖర్, సూర్య కిరణ్ తదితరులు కరాటే కల్యాణిపై జోక్‌లు వేసుకున్నారు. మరోవైపు సీక్రెట్ రూంలో ఉన్న అరియానా.. సోహైల్ వీపు మీద ఎక్కి కూర్చుని ఎక్స్‌ర్‌సైజ్‌ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఆటలో భాగంగా.. పోస్ట్ కార్డ్‌ ద్వారా ఒక లేఖను పంపి, స్లిప్‌లో రాసి ఇచ్చిన దాని గురించి వివరించాలని కోరారు. అందులో భాగంగా మీ ఊరి గురించి చెప్పాలని మోనాల్‌కి స్లిప్ అందించగా.. ఊరు విషయాన్ని పక్కనపెట్టి తన తండ్రి చనిపోయాడని, అంకుల్‌ ఒక్కరే తమను చూసుకుంటున్నారని ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి.. గంగవ్వ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో అందరూ గంగవ్వను ఓదార్చారు. ఇక కిరణ్‌ కలగజేసుకొని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తండ్రి గురించి చెప్పడమేంటని మోనాల్‌పై కాస్త సీరియస్‌ అయ్యారు. అభిజిత్‌ కలగజేసుకోని ఆమె ఫీలింగ్‌ని చెబుతోందని, వద్దనడానికి మనం ఎవరమని అన్నాడు. ఇక్కడ కాస్త గొడవ జరిగింది. అనంతరం మెహబూబ్ దిల్‌సే సైతం తనపేరెంట్స్‌ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నాడు. ఇక సీక్రెట్ రూంలో ఉన్న సొహైల్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫోన్ చేసి బిగ్‌బాస్ పేరుతో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. అయితే ఆ ఫోన్ జోర్దార్ సుజాత లిఫ్ట్‌ చేయడం.. ఫోన్‌ మాట్లాడింది బిగ్‌బాస్‌కాదని, అతని పక్కన ఓ అమ్మాయి ఉందని నోయల్‌ అనడం, ఫోన్ చేసింది ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా.. బిగ్ బాసేనా లేక ఫోన్ చేసింది ఎవరా అన్నది తెలుసుకోవాలి కదా అని కల్యాణి అనడంతో సుజాత కన్నీళ్లు పెట్టుకుంది. మరోసారి సోహైల్‌ సిక్రేట్‌ రూమ్‌ నుంచి ఫోన్‌ చేయగా కల్యాణి లిఫ్ట్‌ చేసింది. తాను బిగ్‌బాస్‌ని అని, ఫుడ్‌ ఆర్డర్‌ ఏమైందని అడిగాడు. ఫుడ్‌ అంతా రెడీగా ఉందని కల్యాణి చెప్పగా.. పంపించాలని బిగ్‌బాస్‌ వాయిస్‌తో సోహైల్‌ చెప్పాడు. ఇక సొహైల్ అడిగినట్టుగానే చికెన్, సాంబార్ చేసి రూంకి పంపించారు. తరువాత నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అందులో గంగవ్వను నామినేట్‌ చేసే విషయంతో కొంతమంది తెలివిగా ప్రవర్తించారు. గంగవ్వకు చాలా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందని, కచ్చితంగా ఆమె సేఫ్‌ అవుతారంటూనే ఆమెను నామినేట్‌ చేశారు. మొత్తానికి ఈ వారంలో ఎలిమినేషన్‌లో అభిజిత్, సూర్యకిరణ్, అఖిల్ సార్థక్, దివి, మెహబూబా, సుజాత, గంగవ్వ ఉన్నారు. ఇక నామినేషన్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం హౌస్‌లోకి ఓ పోస్ట్‌ పంపిచాడు బిగ్‌బాస్‌. అందులో ‘చందమామ లాంటి ఇంటికి ఒక మచ్చ ఉంది. ఆ మచ్చే కట్టప్పలా మీ ఆటకు అడ్డు పడొచ్చు. మీతోనే ఉంటూ మీకు నష్టం కలిగించవచ్చు. ఆ కట్టప్ప మీ 14 మందిలో ఒకరు ఉండొచ్చు’ అంటూ ట్విస్ట్ ఇవ్వడంతో కట్టప్ప ఎవరన్న ఇంటిసభ్యుల్లో ఆసక్తిగా మారింది.

Related posts